ఆడిపోసుకుంటున్నారా

నిన్ను ఆడిపోసుకుంటున్నారా నా కన్నా,
నువు నా తండ్రివిరా నీకు నేనున్నా,
ఇలారా ఎంచక్కా ఆడుకుందాం ఏదన్నా

చిన్నప్పుడు మనతో ఆటాడే మాటాడే
మూలగది తాత మాటలలో ఇవే వినిపించేవి
పూజగది దేవుడి చూపులలో అవే కనిపించేవి

మనం ఎదిగే కొద్దీ ఏడాది ఏడాదికీ కొంచెం పెద్దగా
తాతంత దేవుడి వయసు తగ్గుతూండేది కొద్దికొద్దిగా
మనకి అన్నీ సమకూర్చే నాన్నలా
మనల్ని ఎత్తుకు తిప్పే మామయ్యలా బాబయ్యలా

ఇంకాస్త మనం పెరగడం
పడుచుదనం ఇద్దరికీ మరికాస్త రావడం
మనకి దారి చూపే అన్నయ్య హస్తంలా
మన దరిన నిలిచే ప్రియమైన నేస్తంలా

గిర్రున తిరిగే కాలంతో రివ్వున ఎగిరే పక్షిలా
మనం చేరతాం నడివయసు పర్వానికి
దేవుడి జవ్వనం మన బిడ్డల్లా యవ్వనానికి

వచ్చేస్తుంది మనకి తూలిపడే ముసలితనం
ఇచ్చేస్తుంది అది దేవుడికి తుళ్ళిపడే పసితనం

మూలాలు తలుచుకుంటూ
ఒక మూలగా మనం కూర్చుంటాం
మన పిల్లలు వారి పిల్లలని పెంచుకుంటూ
వారిని మందలించడం చూస్తుంటాం

ఆడించే తాతయై గెలిపించే నాన్నయై
వెంటుండే నేస్తమై మురిపించే బిడ్డయై
ఇంతింతై ఇసుమంతై
దేవుడు గదిమూలకి చేరినట్టు
మనం మూలగదికి మారినట్టు

నిన్ను ఆడిపోసుకుంటున్నారా నా కన్నా,
నువు నా తండ్రివిరా నీకు నేనున్నా,
ఇలారా ఎంచక్కా ఆడుకుందాం ఏదన్నా

మళ్ళీ అదే మాట వినిపిస్తుంది
అయితే ఈసారి అది అనేది మన గొంతు
ఆ తంతు చూడడం అదే దేవుడి వంతు

I asked notebookLm to generate a conversation on this poem giving some inputs and it came up with this

+1
0
+1
0
+1
0
+1
0

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This category

Other categories

ఇష్ట పది

నవ నవరత్నాలు

Latest (నవ) 9 (నవ) Kavithalu (రత్నాలు).