నాన్నంటే ఘంటశాల పాటలకి తన తల ఊపడమే కాదోయ్
నాన్నంటే రెహమాను పాటలకి నీతో కాలు కదపడమోయ్
నాన్నా అనే పిలుపు అవసర సంభోదన కాదోయ్
నాన్నని పిలిచే గొంతు పలికే సప్తస్వర సంగీతమోయ్
నాన్నంటే బుడిబుడి నడకలకి ఆసరా అందించే చూపుడు వేలు కాదోయ్
ఆ వేలు పట్టువిడుపుల స్పర్శ ఇరువురికి కలిగించే
మధురానుభూతి వేలకి వేలోయ్
నాన్న వేసే సూటు నాన్నకి ఒక హంగు కాదోయ్
ఆ సూటునాన్నలో హీరోని చూసే నీ చూపే త్రిల్లింగోయ్
నాన్నంటే నిన్నటి నీ నవ్వే కాదోయ్
నాన్నంటే నేటి నువ్వేనోయ్
నాన్నంటే ఎప్పటికీ చిరునవ్వేనోయ్
+1
+1
+1
+1

Leave a Reply