నీకు నువ్వు ఎదురైతే నిన్ను నువ్వు గుర్తిస్తావా
నీకు నీలా కాక మరోలా బ్రతకాలని ఉందేమో
నిన్ను నువ్వు అడిగి తెలుసుకునే అనువిస్తావా
నీకు నిజం చెప్పే చనువిస్తావా, అనుమతిస్తావా
నీలో నీపై ఎంత ప్రేమ దాగుందో
అది నీ పిలుపుకై ఎదురు చూస్తూ ఎలా ఆగుందో
మూసిన లో తలుపులు తెరిచి లోతుగ పరికిస్తావా
నిను బయటకు రానిస్తావా నీతో నడిపిస్తావా
నీ ఆలోచనలని బజ్జోపెట్టో, పక్కకు నెట్టో
నీ గుండియతో ఆటలాడతావా, మాటలాడతావా
అలా చేసిన వెంటనే తెలుస్తుంది
నీవంటే వేటాడే నీ వ్యాపకాలు కాదని
నీవంటే వెంటాడే నీ జ్ఞాపకాలు కాదని
నీవంటే నీ వెంటుండే నీవని నీవేనని
+1
+1
+1
+1

Leave a Reply