Translation of a peom “Fear of the river”
ఎందుకే ఓ నదీ, నీ మది బెదురుతున్నదీ
నెమ్మది నెమ్మదిగా చేరావుగా సంద్రం సన్నిధి
ఓ నదీ, మరి ఏల నీ మది ఇలా వణుకుతున్నది
తీరా తీరం చేరి సాగర సంగమ వేళ
వెనుదిరిగి చూసేవేల, వెనుకంజ వేసేవేల
నీలాల మబ్బు నుండి దిగి
నేల నలుమూలలా ఒదిగి, ఎదిగి
ఎత్తైన కొండలపైనుండి దుమికి
ఎన్నో అడవుల వెంబడి ఉరికి
సంపాదించుకున్న నీ ఉనికి ముద్ర పోతుందనా
కడలిలో కలిసేవరకే అనిపిస్తుంది కనుమరుగైపోతావని
ఆ తరువాతే తెలుస్తుంది నీవే ఆ కడలివైపోతావని
అవును నీ ఇంత చిన్ని బానిస ముద్ర పోతుంది
అదే అంతులేనంత మహా సముద్రమైపోతుంది
+1
+1
+1
+1

Leave a Reply