ఓ దేవా
నీ చుట్టూ కోటానుకోట్ల జనం
నీతో అనుక్షణం మాట్లాడుతూనే ఉంటాం
నీ అందాన్నో గొప్పతనాన్నో పొగుడుతూనే ఉంటాం
నువ్వూ తమాషాగానే ఉంటావు బిజీగా కనిపిస్తూ
మాకు చేయూత నందిస్తూ, మా కోరికలు తీరుస్తూ..
కానీ లోలోపల ఎంతో ఒంటరితనం అనుభవిస్తూ
నువ్వు కోరుకునేవి ఆ మాటలో, పాటలో కావేమో!
ఈ పూజలూ, నోములూ నిన్ను విసిగిస్తాయేమో!!
నువు మాట్లాడితే వినేవారికై చూస్తూంటావేమో!!!
నోరారా మాట్లాడ ఎవరూ లేని నువ్వు ఒంటరివి కాదూ!
పోనీ, నన్ను నీ నేస్తంగా మలచుకోరాదూ!!
తనివితీరా నీ ఊసులు నాతో పంచుకోరాదూ!!!
+1
+1
1
+1
+1

Leave a Reply