కుంభమేళా

ఈ నెల సరుకులతో కాస్త సర్ఫు ఎక్కువగా కావాలని
కైలాసంలో వాషింగు మిషను అడిగింది చంద్రయ్యని

మహాకుంభమేళాలో జనం వదిలేసిన పాపాలని
గంగమ్మ మోసుకొస్తుందిగా వాటిని కడగడానికని

ఈ నెల సరుకులతో కాస్త సర్ఫు ఎక్కువగా కావాలని
వాషింగు మిషనడిగింది సరుకులు తెచ్చే చంద్రుడిని

నెల వంట సరుకులు తగ్గించి తెస్తా ఈ మారు
నెలవంక పలికాడు మిషను వంక చూసి ఓ మారు

పాపాలు కడుగుకోవడానికి కాదు జనుల గంగ మునకలు
అవన్ని భక్తులకి దైవంపై ఉన్న నమ్మకానికి మచ్చు తునకలు

గంగ ఈ శివరాత్రికి వాటిని వెంట తీసుకొస్తుంది
శివయ్య పాదాలకి సజల అభిషేకం చేయిస్తుంది
దానికి మురిసి స్వామికి కడుపు నిండిపోతుంది

నెలంతా ఆయన చేసేది ఇక ఉపవాసమే
వంటింటి పొయ్యి దగ్గర పిల్లి స్థిరవాసమే

అందుకే

నెల వంట సరుకులు తగ్గించాలి ఈ మారు
నెలవంక పలికాడు మిషనొంక చూసి ఓ మారు

+1
0
+1
0
+1
0
+1
0

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This category

Other categories

ఇష్ట పది

నవ నవరత్నాలు

Latest (నవ) 9 (నవ) Kavithalu (రత్నాలు).