అమ్మతో

My mother at the age of 90, had a hip fracture and had a surgery. I could not digest the fact that she may have to be bed ridden forever.

మళ్ళీ ఎపుడూ  పడకమ్మా

ఈ బాధల బారిన పడకమ్మా

ఈ పడటాలు, పడకలూ నీ కెందుకమ్మా లేనిపోని శ్రమా

చేతి ముద్దలు నీకు తినిపించే భాగ్యం నా కిచ్చేందుకోసమా

నీ చేయి పట్టి నడకలు నేర్చిన నేను

నీకు మళ్ళీ నడకలు నేర్పడమా

అది వినడానికి బాగుందేమో కానీ నాకైతే నచ్చట్లేదు

మళ్ళీ పడకమ్మా

నే మారాం చేస్తూ అటు ఇటుగ పరిగెడుతూ ఉంటే

నను గారం చేస్తూ ఒడి పట్టగ పరిగెట్టావు నా వెంటే

మళ్ళీ మారాం చేస్తా ఏదీ నను పట్టుకో చూద్దాం

తిరుగాడే నిను చూడాలని ఉంది పద అలా చేద్దాం

+1
0
+1
0
+1
0
+1
0

Comments

One response to “అమ్మతో”

  1. జ్యోత్స్న

    నిజం అమ్మకి ఏమన్నా అయితే తట్టుకోలేము

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This category

Other categories

ఇష్ట పది

నవ నవరత్నాలు

Latest (నవ) 9 (నవ) Kavithalu (రత్నాలు).