అందంగా పుట్టడం
సినిమాల్లో అడుగెట్టడం
మా గుండెలు కొల్లగొట్టడం
అంతా నీ ఇష్టమేనా శ్రీదేవీ
మా బాధ అర్ధం చేసుకోవదేమీ
తెలుగు మాని హిందీ సినిమాల్లోకి వెళ్ళావ్
పర్లే అని ఊరుకున్నాం
బోనీకపూర్ ని పెళ్ళి చేసేసుకున్నావ్
పోనీలే అని సరిపెట్టుకున్నాం
సినిమాలకి దూరమై ఇంటికే అంకితమయ్యావ్
సరేలే అని వదిలేశాం
ఇంటర్వెల్లో దఎండ్ కార్డ్ వేసి ఆపేయడం
వయ్యారి వాలు కళ్ళని అర్ధాంతంగా మూసేయడం
అంతా నీ ఇష్టమేనా శ్రీదేవీ
మా బాధ అర్ధం చేసుకోవదేమీ
బుల్లిపెట్టెలో బూచాడున్నాడన్నావ్, విన్నాం
గమ్మత్తుగ లేదా.. ఏమా సరదా అంటే, నవ్వాం
సిరిమల్లె పువ్వా నావాడెవడే అంటే, నేనే అన్నాం
ఆకు చాటు పిందెలా తడిస్తే, మేం చిందులేశాం
నువ్వు వెల్లువ గోదారివైతే, మేం వెల్లాకిల్లా పడ్డాం
నిన్ను దేవత, ఇంద్రజ అన్నారు.. పోదులెమ్మన్నాం
తింగరిబుచ్చినన్నావ్.. కచ్చిగా కాదు పొమ్మన్నాం
కానీ అదే నిజం చేసేశావ్
ఝాము రాతిరి ఝామ్మని నీ గూటికి ఎగిరేశావ్
అంతా నీ ఇష్టమేనా శ్రీదేవీ
మా బాధ అర్ధం చేసుకోవదేమీ


Leave a Reply