చిర పరిచితులైన మన గరికపాటి వారు
తెలుగు భాషకు చిరునామా లాటి వారు
ఆయన అవధులు లేని అవధాన ధని
చెవులూరించే పసిడి పలుకుల గని
సంఘ క్షేమమే ప్రసంగ ద్యేయంగా
ఉపన్యసించే ప్రసంగ సంఘ సంస్కర్త
నాది మార్తాండ తేజం
నిజాన్ని నిర్భయంగా పలకడమే నా నైజం
అని సభాముఖంగా ప్రకటించిన ప్రచండుడు
ప్రవచనాలని ప్రియవచనాలుగా పలికే చతురోక్తుడు
చలోక్తులతో యుక్తవయస్కులని సైతం ఆకట్టుకునే యుక్తుడు
తల్లి మళ్లీ తన బిడ్డడికి బిడ్డగా పుడుతుందంటారు మురిపెంగా
తెలుగు తల్లే గరికపాటి వారింట వెలసి పెరుగుతోంది ప్రవర్ధమానంగా
అందుకే అయ్యింది తెలుగు భాషకి చిరునామాగా వారి యిల్లు
సగౌరవంగా కురిపిస్తున్నాం మా నమస్సుమాంజలుల జల్లు
+1
1
+1
+1
+1


Leave a Reply