చదువులతల్లి మక్కువ

చిన్నప్పటి నుండి చదువులతల్లికి నేనంటే మక్కువ
అంతా సమానమే కానీ నా సమానం కాస్త ఎక్కువ

ఓ వజ్రపు తునక కోసం ఎన్నో గనుల తవ్వించింది
తనకు నచ్చిన విధంగా మరెన్నో నగిషీలు చెక్కించింది

ఆ బొమ్మను రమగా మలచింది
ఇటు రమ్మని బ్రహ్మయ్యను పిలిచింది

నా నుదిటి రాతలో ఆ బొమ్మని జత కలిపించింది
తన ఎక్కువ సమానానికి సమ్మానం జరిపించింది

+1
0
+1
1
+1
0
+1
0

Comments

4 responses to “చదువులతల్లి మక్కువ”

  1. Anonymous

    చాలా బాగుంది.

  2. అన్నపూర్ణ

    అద్భుతం.

  3. Super

  4. Anonymous

    చాలా బాగుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This category

Other categories

ఇష్ట పది

నవ నవరత్నాలు

Latest (నవ) 9 (నవ) Kavithalu (రత్నాలు).