దేవా నీకు శక్తుంటే ఆ గుడిని కదిలించి చూపు
లేదా రా చుక్కేద్దాం, గోపురం ఎలా ఊగుతుందో చూడు
లేదా రా చుక్కేద్దాం, గోపురం ఎలా ఊగుతుందో చూడు
చిరునవ్వడిగింది నన్ను, రోజూ నన్నెందుకు పిలుస్తావని
బదులడిగాను, అందాన్ని పిలిస్తే నువ్వెందుకు వస్తావని
బదులడిగాను, అందాన్ని పిలిస్తే నువ్వెందుకు వస్తావని
గుళ్ళో నిలబడి తాగుతున్నావ్ బుద్ది ఉందటరా నీకు
దేవుడు లేని చోటెక్కడో చెప్పు దాక్కుని చుక్కేసేందుకు
దేవుడు లేని చోటెక్కడో చెప్పు దాక్కుని చుక్కేసేందుకు
వ్రాసిన లేఖకు జవాబు రాకుండానే ఇంకోటి మొదలెట్టావెందుకు
ఆ లేఖకి తానేం వ్రాస్తుందో తెలియకపోతే తనకి వ్రాయడమెందుకు
ఆ లేఖకి తానేం వ్రాస్తుందో తెలియకపోతే తనకి వ్రాయడమెందుకు
జీవితం ఎలా సాగుతుందో చేతిగీతల్లో వ్రాసుంటుందా
చేతులే లేనివాడి జీవితం మరెక్కడో దాగుంటుందా
చేతులే లేనివాడి జీవితం మరెక్కడో దాగుంటుందా
నా అసమదీయులని చల్లగా చూస్తూండు స్వాములూ
వారేగా పాపం నా బాగుకై నిన్నడిగే ఆసాములు
అదే చూపుతో తసమదీయులనీ కాస్తూండు దేవుడూ
వారే లేకుంటే నను నీ దరికి చేర్చమని అడిగేదెవడు
వారేగా పాపం నా బాగుకై నిన్నడిగే ఆసాములు
అదే చూపుతో తసమదీయులనీ కాస్తూండు దేవుడూ
వారే లేకుంటే నను నీ దరికి చేర్చమని అడిగేదెవడు
+1
+1
+1
+1

Leave a Reply