At the time of my mother’s ceremony rituals
బ్రహ్మగారు అంటున్నారు.. శాశ్వత గౌరీలోక ప్రాప్తిరస్తు…
అరిటాకులోని పిండంపై మాతో పసుపు చల్లిస్తూ
నేనూ అదే చేశాను తలపంకిస్తూ నమస్కరిస్తూ
అయినా అన్యమనస్కంగా దీర్ఘంగా ఆలోచిస్తూ
గౌరీలోకం దూరం కదా చాలా
అమ్మని అంత దూరం పంపించాలా
ఇక్కడే ఎక్కడో ఉండిపొమ్మంటే చాలా
ఎదురుగా పటంలో అమ్మ కనిపిస్తూ
విషయం చెప్పింది చిరునవ్వు చిందిస్తూ
చివుక్కుమంటున్న మనసుని ఊరడిస్తూ..
నువ్వనుకున్నంత దూరమేం కాదు గౌరీలోకం
అది ఇక్కడే ఉంటుందిరా పిచ్చిమాలోకం
పచ్చటి పంటలు పిండి వంటలు కళకళలాడే అందాలు
చేదోడు వాదోడుగా కలిసి నడిచే బంధాలు
అవన్నీ ఉంటే ఎక్కడన్నా ఇంకేం కావాలి అంతకన్నా
గౌరీలోకం అంటే అదే ఇంకెక్కడో కాదురా పిచ్చికన్నా
నిండుగా నవ్వుతూ చెప్పింది పండు ముత్తైదువ పిండం
అర్థం అయ్యాక పెట్టుకున్నా మనసారా మరోసారి దండం


Leave a Reply