హనుమ & రామ సంభాషణం

రా: ఇదిగో ఓ హనుమా….
ఏమి అవుదునయ్య నేను ఏమి అవుదును
ఇంత ప్రేమ చూపు నీకు నేనేమి అవుదును

హ: జై శ్రీరామా….
నేనెవరో నాకు నిజం తెలిసినప్పుడే
నీకు నాకు బంధమేమొ తెలియవచ్చులే

రా: ఏమి అవుదునయ్య నీకు నేనేమి అవుదును
హ: నేనెవరో తెలిసినప్పుడది తెలియవచ్చును

రా: నీ దేహం నీ గుణమలు అవేగా నువ్వంటే
హ: నేనే నా దేహమైతె నేను నీకు బంటే

రా: ఏమి అవుదునయ్య నీకు నేనేమి అవుదును
హ: నేనెవరో తెలిసినప్పుడది తెలియవచ్చును

రా: నీలోని జీవాత్మే నీ అసలు ఉనికిలే
హ: అయితే పరమాత్మా నేన్నీ అంశేలే

రా: ఏమి అవుదునయ్య నీకు నేనేమి అవుదును
హ: నేనెవరో తెలిసినప్పుడది తెలియవచ్చును

రా: అంతా బ్రహ్మమయం నువ్వూ అదేలే
హ: అయితే ఓ రామా నువ్వే నేనులే

రా: ఏమి అవుదునయ్య నీకు నేనేమి అవుదును
హ: తెలిసొచ్చెను ఓ రామా నువ్వే నేనులే
నేనే నువ్వులే అంతా ఒకటిలే
ఆ ఒకటే నువ్వులే

రా: ఏమి అవుదునయ్య నీకు నేనేమి అవుదును
హ: నాలో ఉన్న నువ్వే అసలు నేనులే
నేనంటూ మరి వేరుగ లేనేలేనులే
నేనే నువ్వులే నువ్వే నేనులే

+1
0
+1
0
+1
0
+1
0

Comments

One response to “హనుమ & రామ సంభాషణం”

  1. Jyotsnaprabha

    Thoughtful philosophical

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This category

Other categories

ఇష్ట పది

నవ నవరత్నాలు

Latest (నవ) 9 (నవ) Kavithalu (రత్నాలు).