నవ్వండి
చిరునవ్వులు రువ్వండి
మాటిమాటికి నవ్వండి
పలువరసలు మెరిసేలా మురవండి
ఎందుకి నవ్వని మిమ్మడిగేదెవరూ
నిండుగ నవ్వండి అలాగే నవ్వుతు ఉండండి
నవ్వండి
అందరి ముందు నవ్వండి, ముందుగా మీరే నవ్వండి
అందరి పక్కన నవ్వండి, పక్కు పక్కున నవ్వండి
అందరి వెనుక నవ్వండి, వెన్నలా చల్లగ నవ్వండి
నవ్వుని మించిన మందే లేదు
సరదాగా నవ్వండి అలాగే నవ్వుతు ఉండండి
నవ్వండి
కష్టాలున్నాయా అయినా కల కల నవ్వండి
నష్టాలొచ్చాయా అదిగో అపుడే నవ్వండి
కష్టం నష్టం విఐపీలా వాటికి విలువేంటి
వాటిని చూసే నవ్వండి వాటి తోటే నవ్వండి
నవ్వడమేమీ తప్పూకాదు నవ్వకపోతే గొప్పేంకాదు
దొరలాగా నవ్వండి దర్జాగా నవ్వండి
నవ్వండి నవ్వండి నవ్వుతు ఉండండి
I was standing in a queue for over an one hour for car registration number plate at RTA. Saw palli wala there who is making every one smile/laugh with his way of selling.
Wrote this kavitha with that inspiration.
Wrote this kavitha with that inspiration.
+1
+1
+1
+1


Leave a Reply