ఎవరన్నారు దేవుడు మన పిలుపుకి పలకడని
మీరా భజనలా మన పిలుపులో ఆర్ద్రత ఉంటేగా
మన పిలుపు వినబడడానికి విని పలకడానికి
ఎవరన్నారు దేవుడు ఆదమరచి నిదురించడని
యశోదమ్మలా జోలపాడుతూ ఊయలూపితేగా
చిద్విలాసంగా నవ్వుతూ మైమరచి బజ్జోడానికి
ఎవరన్నారు దేవుడు మన నైవేద్యం అందుకోడని
శబరిలా ఆబగా ప్రేమగా తినిపించితేగా
మన ముంగిలి చేరి ఎంగిలైనా తినడానికి
ఎవరన్నారు దేవుడు మనతో కలసి ఆడడని
గోపబాలల్లా మనం తహతహలాడితేగా
తాను మనలను మురిపిస్తూ తారంగమాడడానికి
ఎవరన్నారు దేవుడు మన తోడుండడని
హనుమంతుడిలా హృదయం అర్పిస్తేగా
మనతో ఉండడానికి మనతోడుండడానికి
+1
+1
+1
+1

Leave a Reply