చిన్నప్పుడు నేను NTR వీర అభిమానిని.
6th class అయిన summer holidays అనుకుంట.. అప్పుడు “మనుషుల్లో దేవుడు” అని ntr సినిమా వచ్చింది. RTC Xroads దగ్గర sudarshan talkies లో.
పొద్దున్న నాన్నగారు మొక్కలు, కాలువలు పనిలో ఉండగా మెల్లిగా పక్కకి చేరి ఇవాళ సినిమాకి వెళ్తాను one rupee కావాలి అని గొణిగాను.
“First వచ్చాక చూడచ్చులే” అన్నారు.
అది rank విషయం అనుకొని already reports వచ్చాయి. First rank వచ్చిందిగా అన్నాను ధీమాగా.
“నేనన్నది first తారీఖు” clarity ఇచ్చి పనిలో మునిగిపోయారు.
Disappointed గా అప్పుడు వెళ్ళిపోయా. కానీ ntr సినిమా కదా. కాస్సేపయ్యాక shaving చేసుకుంటూంటే మళ్ళీ దగ్గర చేరా.
నేను నోరు ఎత్తి అడగకముందే నా కాకా విషయం గుర్తించి ఇవాళ 28th అన్నారు. మళ్ళీ disappointment తో వెనుదిరిగా.
ఓ గంట తర్వాత మళ్ళీ ntr గంట కొట్టాడు…
ఈ సారి నాన్నగారు చిల్లర డబ్బాలో డబ్బులు నేల మీద పరచి లెక్కపెట్టి అప్పుడే డబ్బాలో పోస్తూ కనిపించారు. మంచి సమయం అనుకొని, వెళ్ళి “సినిమా రేపే last day” అన్నా. First దాకా ఆగలేం అనే logic indirectగా తెలియజేస్తూ.
ఒక్కసారిగా ఆ చేతిలో పైసల డబ్బాలో పైసలన్నీ నేలపై కుమ్మరించి తీసుకోరా.. సినిమా చూస్తావో, తీస్తావో ఈ డబ్బుతో అన్నారు మహా కోపంగా.
Scene అర్ధం అయ్యింది. క్రింద పడ్డ పైసలు ఏరుతున్న నాన్నగారితో పాటు నేను ఏరి డబ్బాలో పెట్టి calm గా అక్కడ నుంచి జారుకున్నా.
మద్యాహ్నం వేళకి ఇంక ఆ సంగతి పూర్తిగా మర్చిపోయి వేరే ఆటల ద్యాసలో డాబా మీద ఆడుకుంటూంటే మెల్లగా అక్కడికి వచ్చి ” last day అన్నావుగా వెళ్ళు” అని రూపాయి note చేతిలో పెట్టి క్రిందికి వెళ్ళిపోయారు.
Permission, డబ్బు ఇచ్చిన సంతోషం కంటే ఇంత last minute లో ఇచ్చారు, tickets దొరుకుతాయో లేదో cinema start అయిపోతుందో ఏమో అనే ఆత్రం ఆ time లో…
“ఈ పెద్దాళ్ళున్నారే పిల్లల బాధ అర్దం చేసుకోరు.. ” అనుకుంటూ పరుగెత్తా…
సినిమా happy గా చూసి Evening నిదానంగా నడుచుకుంటూ వస్తూంటే ఇంటికి ఓ ఫర్లాంగు దూరంలో ఉండగా gate దగ్గర నాన్నగారు నిలబడి కనిపించారు. నన్ను చూడగానే ఎంతో హడావూడిగా speed గా అడుగులేస్తూ నా దగ్గరకి వచ్చారు. Just నాకు రెండగుల ముందు దాకా రాగానే ఆగి వెనక్కి తిరిగి మళ్ళీ ఇంటివైపు నడక సాగించారు, నాతో ఏమీ చెప్పలేదు. ఏమీ అడగలేదు. ఎందుకు వచ్చారో తెలియదు.
ఇంటికేసి నడుస్తూ, అప్పుడప్పుడు వెనక నేను వస్తున్నానా లేదా అన్నట్టు చూస్తూ ఇల్లు చేరారు. వెనకే నేనూ ఇంటికి చేరా.
ఇంట్లోకి వెళ్ళి ఆయన మంచం మీద గోడవారగా బోర్లా పడుకున్నారు. నేను అటు వెళ్ళగానే “ఒకటే నడుం నొప్పి. కాస్త వీపు తొక్కరా” అన్నారు.
హమ్మయ్య నా మీద కోపం కాదు అని మురిసి
పోయి కాళ్ళ నుంచి వీపు దాక తొక్కసాగాను.
అప్పుడే అటు వచ్చిన అమ్మ “నడుం నొప్పి వచ్చిందంటే రాదూ మరీ… మధ్యాహ్నం నువ్వు వెళ్ళినప్పటి నుంచి ఆ గేటు దగ్గర పడిగాపులే.
లోపలకి రావడం, అర నిమిషంలో మళ్ళీ గేటు దగ్గరకి వెళ్ళడం, అటు సందు చివర దాకా పోవడం, వెనక్కి వచ్చి మళ్ళీ ఇటు సందు చివరకి. అలా తిరగడమే సరిపోయింది” అంటూ అసలు సంగతి చెప్పింది.
నేను సినిమాకి వెళ్ళిన పావుగంటకి తెలిసిందట, ఎదురు srt quarters లో మా friend kishore వాళ్ళ ఒక అక్క stove పేలి ఒళ్ళంతా కాలి చనిపోయిందట.
నేను ఇంటికి వస్తూ ఆ విషయం తెలిసి జడుసుకుంటానని గేటు బయట పచార్లుట.
అక్కడికీ వాడు వచ్చేది సినిమా అయ్యి ఆరింటికి కదా అప్పుడు నుంచోండి అని అమ్మ అంటే, ఏమో ticket దొరకక ఇప్పుడే వచ్చేస్తే… అని మూడింటిదాకా..
ఇక మూడయ్యింది, ticket దొరికే ఉంటుంది ఇక లోపలకి రండి.. అంటే ఏమో ఏ కరెంటో పోయి వెనక్కి పంపేస్తే అని ఆ next గంట.
అక్కడకీ మా అత్త నవ్వుతూ… ఎందుకైనా మంచిది మధ్యలో దాహం వేసి interval లో ఇంటికి వస్తాడేమో పోనీ మరచెంబు పట్టుకెళ్ళి అక్కడే కూర్చోరాదూ… అంటూ తనదైన style లో చురక వేసిందట.
అదీ చేద్దురు. కానీ వెళ్ళింది ఏ సినిమాకీ అని అడగలేదు. అది ఇటూ balaji talkies కా, ఇటు xroads లో sangam, sudarshan వైపా అని తెలియక gate దగ్గరే ఆగిపోయారట. అందుకే సగం అటు వైపు సగం ఇటు వైపు నడకలు.
విషయం తెలిశాక నాకు కళ్ళలో నీళ్ళు తిరిగాయి. నాన్నగారిది అంత గొప్ప ప్రేమ. బయటకి అస్సలు చూపించరు.
నిజంగా మనుషుల్లో దేవుడు సినిమా అక్కర్లేదు. ఆయన చాలు.
ఇవాళ నాన్నగారి birthday…


Leave a Reply