ఓ దేవా
నాకు ఇది తెలుసు!
నే వేసే ప్రతి అడుగూ నాతోటే నువ్వూ నడుస్తావని
నేనేం చేస్తానా అని చూస్తూంటావని
నాకు ఇదీ తెలుసు!
నేను నిద్రించే ప్రతిక్షణం నువ్వు నా వెన్నంటే ఉంటావని
నేను ఏం కలలు కంటానా అని చూస్తూంటావని
కానీ
నీకు నచ్చే ఏ పని నేను చేయనేమో!
నీకు నచ్చే ఏ కలా నాకు రాదేమో!!
అయినా
నాకు నువ్వు ప్రతిరోజూ మరో రోజుని ఇస్తూనే ఉన్నావు
ఎంతో ఆశగా నాతో నడుస్తూ, నిద్రలో నా పక్కనే నిలుస్తూ
అలా కాక
నీకు నచ్చే పనులే నాతో బలవంతంగానైనా చేయించచ్చుగా
నాకు వస్తే బాగుండని నువ్వు ఆశించే కలలే నాకు రప్పించచ్చుగా
ఓహో
ఇప్పుడు జరుగుతున్నది అదేగా అంటావా
అవునులే, నీ ప్రమేయం లేనిదే ఎక్కడైనా ఏం జరుగుద్ది
తెలిసిందేగా చీమైనా, నేనైనా దాటలేం నీ నిబద్ది
కానీ, అంతా నేనే చేస్తున్నాననుకుంటోంది నా మందబుద్ది
+1
+1
+1
+1

Leave a Reply