కుంచె అంచులు సవరించి
కలగలిపిన రంగుల ముంచి
విరించి గీసిన చిత్రపటంలో
నేనూ ఒక చక్కని చుక్కనే
కానీ
నీటి అలల్లా, సెలయేటిపై మబ్బు నీడలా
చిరుగాలికి రెపరెపలాడే పైరులా
కొండచెరియల్లా, మంచు తెరల్లా
అంతందంగా నను దిద్దలేదెందుకో
వాటిని చూసి నే మురిసేందుకో
వాటి విలువ నాకు తెలిపేందుకో
అలాగే
పోతన పద్యంలా దేవులపల్లి కవితలా
వేటూరి పాటలా సుశీలమ్మ గాత్రంలా
నా గొంతెందుకు పలకజాలదూ
అవి విని తరించే భాగ్యం కలిగిందది చాలదూ
+1
+1
+1
+1


Leave a Reply