నేను.. ప్రకాశం

Tributes to my maternal uncle Sri Prakasham, who used to call almost all relatives every week to enquire wellbeing.

“నేను.. ప్రకాశం” నాతో ఆ ఆకాశం అందివ్వాళ
మనవాళ్ళందరికీ నా ఈ సందేశం అందివ్వాల

మీ నవ్వులు నా కోసం ఏ పొద్దూ ఆపొద్దు
ఆ నవ్వులె నాకో చిరుముద్దని మరువద్దు

చుట్టాలంతా అప్పుడప్పుడు ఏదో చెంతన కలవండి
చుట్టూ చేరి నవ్వేటప్పుడు నన్నూ ఒకపరి తలవండి

ఒకరికి ఒకరు ఫోనులు చేసి మంచి చెడ్డా అడగండి
చేతనయిన సాయాలు చేసి అండదండగా నిలవండి

దండం పెడుతూ తలపైకెత్తా సరే మామా అంటూ
మురిసి మెరిసిందో చుక్క చాలింకేం కావాలంటూ

+1
0
+1
0
+1
0
+1
0

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This category

Other categories

ఇష్ట పది

నవ నవరత్నాలు

Latest (నవ) 9 (నవ) Kavithalu (రత్నాలు).