ఓ తరం వెళ్ళిపోతోంది మన కళ్ళకి, వాకిళ్ళకి దూరమై
దేవుడితో ముఖాముఖీ మన క్షేమం కోరడం కోసమై
మనల భుజముల నెక్కించుకు తిప్పిన వారు
మన భుజముల స్వారీ చేసి వెళ్ళిపోతున్నారు
వేలు పట్టి నడిపించిన వారూ
వెన్ను తట్టి గెలిపించిన వారూ
ఒక్కొక్కరే ఒక్కొక్కరే దిక్కులుగా, చుక్కలుగా
ఆటపాటలు నేర్పిన వారు పటాలుగా
జ్ఞానం పంచిన వారు జ్ఞాపకాలుగా
గురుతుల్యులు గురుతులుగా
ముందు తరాలకు తారలుగా
ఓ తరం వెళ్ళిపోతోంది మన కళ్ళ, వాకిళ్ళ దూరమై
దేవుడితో ముఖాముఖీ మన క్షేమం కోరడం కోసమై
+1
1
+1
+1
+1


Leave a Reply