ఆవకాయ
ఏమిటి ఈ ఆవకాయ ఇంత మధురంగా ఉంది
నూనె బదులు పట్టుతేనె చిలికినట్టు
చెరుకు కొడవలితో మామిడి ముక్క కొట్టినట్టు
తెలిసింది, తెలిసింది
కారం తో బాటు అమ్మ మమకారం కలిపారు
ఆవపిండి పాళ్ళల్లో ఆవిడ ప్రేమ పిండి కలిపారు
దేవుడు నాస్తికుడేమో
దేవుడు నాస్తికుడేమో
అందుకే పూజగదిలోకి రాడేమో
పెట్టిన నైవేద్యం ముట్టినట్టు లేదు దాఖలా
ఇంక నా కోర్కెల చిట్టా చేయాల్సిందే బుట్ట దాఖలా
మధుర స్మృతుల పుట్ట
పొద్దున్నే నారాయణ ఇంటి తలుపు తట్టి పంచాంగం అడుగుతుందట
ఈ నాటి తిథి వార నక్షత్రాలలో గతంలో ఏం జరిగిందీ అని
అవును మరి, భవిత చెప్పడంలో పంచాంగం దిట్ట!
నారాయణ మనస్సంతా మధుర స్మృతుల పుట్ట!!
దమ్మిచ్చు
దమ్మిచ్చును నమ్మిన దైవము
దమ్మిచ్చును ఔషదమ్ము; సొమ్ము దమ్మిచ్చును సుమ్మీ
కొమ్ముగాచెడి స్వజనులు దమ్మిచ్చు
దమ్మిచ్చు శుభమ్ముగోరు హితజనమ్ము కుమారా
మందారమందామా?
ఏమందామని ఆ మందహాసాన్ని?
విరిసిన మందారమందామా? నిర్మల మందాకినీ తటమందామా?
అది అమందానంద కందళిత హృదయారవింద సందోహమే
లేదందు సందేహమే
Babayya Thandri
నేనూ లెజెండవ్వాలి
రామబాణం తాకి నేలవాలిన వాలిని
స్వామి అడిగాడు కోరుకో మరుజన్మకి ఏం కావాలి
జూలైలో పుట్టాలి నేనూ లెజెండ్ అవ్వాలి
కోరాడట వాలి స్వామి చరణాల వాలి
పలికాడు రాముడు వాలిపై చూపుతూ జాలి
అదెలా వాలీ దానికి చాలా పుణ్యం కలిసి రావాలి
My son added this…
సరే కనీసం సెప్టెంబరు లో పుట్టే భాగ్యమియ్యి
అడిగాడు వాలి
హహహ అని నవ్వి అన్నాడు రాముడు ఆశకి కూడా హద్దుండాలి
Finally in my wife’s words
అలా నవ్వుతావేం స్వామీ
నేను ఫిబ్రవరీ అడిగానా ఏమీ
అన్న వాలి చెవిలో చెప్పాడు రాముడు రహస్యంగా
ఫిబ్ చాన్స్ వస్తే నేనే పదకొండో అవతారం ఎత్తేస్తాగా
Maa vaadu
ఈతరాని వాడు ఈదుకొచ్చు…
A prakriya in astaavadhaanam, where a misleading line will be given and a kavitha to be completed making that line as 4th line.
బక్రీదు నాడే జరుగునిచట ఈత పోటీలు
ఊరిజనులెల్ల చేరెదరు ఈతకో, ఈదుకో
ఈత వచ్చు వాడు ఈత కొచ్చు
ఈత రానివాడు ఈదుకొచ్చు
ఒక స్నేహితుడి పై ఛందస్సు తో పద్యం experiment

Leave a Reply