పల్లకి కదిలే ముచ్చట కనరే..

అదిగో ఒక పల్లకి అటువైపుగ వెళ్తోంది
ఊరంతా కళ్ళుతెరిచి విస్తుపోయి చూస్తోంది

బలముగ కనిపిస్తూ, తమ భుజముల పల్లకి మోస్తూ
వడివడిగా అడుగేస్తూ సాగే ఆ బోయలెవరెవరో
దారంట వెలుగులు చిందిస్తూ, చీకట్ల తరిమేస్తూ
బాటను చూపిస్తూ వెలిగే ఆ దివిటీలవి ఏమిటో

ధర్మం, సంస్కృతీ, సంప్రదాయం, విలువలే ఆ బోయల రూపాలు
ఙ్ఞానం, వేదం, బ్రహ్మం, సత్యాలే ఆ దివిటీ దీపాలు

ఇంతకీ ఆ పల్లకిలో ఎవరున్నారో తెలిసిందా

కంచీపురి నుంచి బృందావని ప్రవేశానికి సాగే యాత్రది
జయేంద్ర సరస్వతి స్వామివారి ఆత్మకు ఊరేగింపది
ఇన్నాళ్ళు ఆయన మోసినవే ఇపుడాయనని మోస్తున్నాయి
ఎన్నేళ్ళో ఆ పీఠం కాచినవే ఇపుడు దారి చూపిస్తున్నాయి

అహోం అహోం అని అంగలు వేస్తూ
హరోం హరోం అని భజనలు చేస్తూ
ఆ పల్లకిని ఘనంగా సాగనంపింది మానవాళి
నమస్కరిస్తూ అర్పించాం మేమూ మా నివాళి

+1
0
+1
0
+1
0
+1
0

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This category

Other categories

ఇష్ట పది

నవ నవరత్నాలు

Latest (నవ) 9 (నవ) Kavithalu (రత్నాలు).