పెళ్ళికి రమ్మని పిలిచా
వస్తానని తలూపావు
రాలేదేం దేవుడా
దసరా సరదాలలో పడి మరిచావా?
కాస్త బడలిక తీరాక ఇవాళ అడిగా దేవుణ్ణి
పెళ్ళికి వర్షం వచ్చిందా?
ఏదైనా అడ్డం వచ్చిందా?
అవి రాలేదంటే నేను వచ్చినట్టేగా…
సన్నాయి, బ్రహ్మగారు, వంటవారు వచ్చారా?
సమయానికి తోడుగ నీవారు నీకై నిలిచారా?
వారొచ్చారంటే నేను వచ్చినట్టేగా…
పెళ్ళికి బంధుమిత్రులొచ్చారా?
కడుపారా తిన్నారా?
అంతా ఆనందంగా ఆశీర్వదించారా?
ఆ అథిది దేవుళ్ళంతా నేనే కాదా?
నవ్వుతూ బదులిచ్చాడు దేవుడు నాకేసి చూస్తూ
తలవంచి దండం పెట్టా ఆనందభాష్పాలు రాలుస్తూ
+1
+1
+1
+1


Leave a Reply