తెర తీయగా రాదా

You must be knowing that as per spirituality, when someone is in deep sleep, jeevatma communicates with paramatma.

తెలుసా ఇవాళ నాకు ఎంత మంచి కల వచ్చిందో
తనివి తీరకనే మెలకువెందుకు తరుముకొచ్చిందో

నీ ఒళ్ళో నేను బజ్జునట్టుగా
నాకు నువ్వు జో కొడుతున్నట్టుగా
మళ్ళీ క్షణంలో
నా ఒళ్ళోనే నువ్వు కూర్చునున్నట్టుగా
నేనే నీకు రాగాలు కూర్చుతున్నట్టుగా

నా చెవికి నువ్వేదో ఊసు చెబుతున్నావట
నీ చేతికి నేనేదో బాస చేసేస్తున్నానట
ఇంకో క్షణంలో
ఇద్దరం కలిసి వెళ్ళి ఎందరితోనో ఆడుతున్నామట
ఎందరో తరలి వచ్చి మనిద్దరితోనూ పాడుతున్నారట

అందరం ఒక్కటిగా కలిసేసినట్టు
ఒక్కరే అందరిగా కనిపిస్తున్నట్టు
నవ్వు తప్ప మరేమీ వినిపించనట్టు
నువ్వు తప్ప ఇంకేమీ కనిపించనట్టు

కాలమంతా క్షణంగా కరిగిపోతూంటే
అసలు కాలమే లేనట్టు ఆగిపోతూంటే
ఒళ్ళు మరిచి, విడిచి నేను నేనవుతుంటే
నేనే నువ్వని మనసుకి ఋజువవుతుంటే

ఒంటరి ఒంటిని చూసి మెలుకువ జాలి పడిందేమో అమితంగా
తుంటరి ఉన్నట్టుండి ఎక్కడినుంచో జారి పడింది అమాంతంగా

బ్రహ్మానందంగా సాగే మనసైన కల చెదిరింది
మాయదారి దారిలోకి మనసు మళ్ళీ చేరింది
సరే మళ్ళీ కలుద్దాం అందాకా తప్పదు ఈ ఎడబాటు
మెలుకువే దోబూచులాట మాని వదలాలి తెరచాటు

+1
0
+1
0
+1
0
+1
0

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This category

Other categories

ఇష్ట పది

నవ నవరత్నాలు

Latest (నవ) 9 (నవ) Kavithalu (రత్నాలు).