వరుస ఎలా కుదిరింది

Wedding anniversary wishes to an affectionate couple (Ramchander & Bramara) in relatives circle
రామచంద్రుడంటే బద్రాద్రి రాముడు కేశవ రూపుడు. భ్రమరాంబ అంటే శ్రీశైలమల్లికార్జునుడైన శివుని సతి. మరి మన రామచంద్రునికి భ్రమరాంబకు ఇంత అన్యోన్య దంపతులుగా వరుస ఎలా కుదిరింది అని అష్ఠావధానం type లో అడిగారొకరు చమత్కారంగా
శివయ్య మరోపేరు చంద్రమౌళి.
అందులో ముందు సగం చంద్ర

రామయ్య ముద్దు పేరు రామచంద్ర
ఇందులో వెనుక సగం చంద్ర.

ఎటు నిలిచినా చంద్ర పరిపూర్ణమైన అర్ధాంగియే
అందుకే
చంద్రవదనలా కలకలలాడే మన భ్రమరాంబ
శివకేశవ సమభక్తుడైన మన రాంబాబుల దాంపత్యం

దినదిన ప్రవర్ధమాన శుక్లపక్షంలా తరుగులేని సోమ
అన్యోన్యతకు అది ఒక తిరుగులేని చిరునామ
…
నా మనసులో మాట చెప్పా ఆ జంటను ఆశీర్వదిస్తూ
అడిగిన వ్యక్తి ఒప్పుకొన్నాడు మనస్పూర్తిగా ప్రశంసిస్తూ
తనవంతుగా తలపంకిస్తూ, తథాస్తు అని తానూ దీవిస్తూ
+1
0
+1
0
+1
0
+1
0

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This category

Other categories

ఇష్ట పది

నవ నవరత్నాలు

Latest (నవ) 9 (నవ) Kavithalu (రత్నాలు).