ఏ రాగమో ఇది ఏ గారమో
ఇది గతమో భవితకు స్వాగతమో
ఎవరమో మేమెవరమో
కలలు కనే చెలులమో, చెలులు కనే కలలమో
కలల అలలపై తేలే మనసు మల్లె పూవులమో
ఎవరమో మేమెవరమో, ఇది మాకెవరిచ్చిన వరమో
చేతన పొందిన కవితలమో
కవితలకందని భావనలమో
ఇద్దరి ఊహల గుసగుసలమో
ఇరు ఊపిరులూపే ఊయలలమో
ఇది ఎందరెందరి దీవెనల బలమో
అది పొందిన మేమెంతటి ధన్యులమో
ఎందరో శ్రేయోభిలాషులు, అందరికీ వందనములు
+1
+1
+1
+1

Leave a Reply