Wrote this for 2019 Ugadi just before elections. That year name is వికారి.
తామే గెలుస్తామని నాయకులకి ఎన్ని కలలో
మరి జనం ఏం చేస్తారో ఈ సారి ఎన్నికలలో
టెన్షన్ పెరుగుతోంది చెమటలు అందరివి కారి
వేడుక చూడ వచ్చింది తెలుగిళ్ళకి వికారి
రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడనుకుంటే తెలంగాణ కేసరి
స్పీడు తగ్గింది ఆయన జోరు తెలంగాణకే సరి
చక్రం తిప్పగలడనుకున్న నారా
గాలి తీసిన సైకిల్ ఎక్కేసినారా
నిలచి గెలువగలడుకుంటే ఓ పికే
కింద పడిపోయె లేకపోయె ఓపికే
వైయెస్సార్ బిడ్డ తిప్పుతూ ఫాను
పుట్టించగలడా సునామీ తూఫాను
నేనే ట్రంపుకార్డని పలికిన కేపాలు
ఆయన మాటలు జోకులకే పాలు
తామే గెలుస్తామని నాయకులకి ఎన్ని కలలో
మరి జనం ఏం చేస్తారో ఈ సారి ఎన్నికలలో
టెన్షన్ పెరుగుతోంది చెమటలు అందరివి కారి
వేడుక చూడ వచ్చింది తెలుగిళ్ళకి వికారి
+1
1
+1
+1
+1

Leave a Reply