A tribute to my lost phone
ఎటు వెళ్ళి పోయావే చెప్పాపెట్టకనే మళ్ళీ వస్తానంటూ ఒట్టైనా పెట్టకనే నా ఊసులు నా ఆశలు నా జ్ఞాపకాల చిరు ముద్రలు నా హాస్యాలూ నా రహస్యాలూ అన్నీ నీలో దాచుకుంటూ నా చేయందుకు నడిచే నీవే కాదు కాదు నా చేయి వదలక నడిపించే నీవే అలా చేజారి పోయావేం ఇలా బేజారుగా నను బజారున పడేశావేం నావారెవరైనా నాతో ముచ్చటించాలంటే నువ్వే దగ్గరుండి ఆ పలుకులు నా చెవినేయడం నా గొంతు దాటక మున్నే నా మాటలు వారికి చేరేయడం ఒక్కసారిగా మాని నువు మాయమైతివే ఒక్క మూలగా కూలి నేను మూగనైతినే
+1
1
+1
+1
+1


Leave a Reply