Wrote “Sri Rama” one lakh times in an year. A kavitha in that context.
ఓ రామా, నేనల్లుకొచ్చా లక్ష శ్రీరామసుమాల మాల ఏ బండ రాతుల పునీతుల చేయనెంచో వాటిపై మోపి కందిన నీ పాదాలకు నీ నామాల నా మాలతో ఒత్తి సేద తీర్చాలని ఓ రామా, నేనల్లుకొచ్చా లక్ష శ్రీరామసుమాల మాల పాదరక్షలు తమ్మునికిచ్చి అడవుల నడిచి అలసిన పాదాలకు నా మాల తాకించి కాసింత ఊరట కలిగిద్దామని… నేనల్లుకొచ్చా ఓ లక్ష శ్రీరామ నామాల మాల కానీ ఓ రామా నీ పాదాల వద్దే సదా కాపున్న హనుమన్నను దాటి మాబోటి ఉడత భక్తులకు బంటు రీతి కొలువుండేనా ఆ సామి వదిలితేనేగా మా ఆసామి పాదాలు మాకందేది దిగాలుగా నిలుచున్న నన్ను జాలిగా చూసింది సీతమ్మ ఆప్యాయంగా పిలిచింది బిడ్డ ఆకలి ఎరిగిన అమ్మలా పాదాల చేరే దారి నా చెవిలో ఊదింది మెల్లిగా "రామపాదాల కన్నా హనుమకి రామనామమే ప్రీతియట రామనవమిన భూ జనుల రామనామ భజన మక్కువట ఆ వేళ స్వామిని వదిలి అటు వెళతాడు హనుమంతు ఆ ఝాములే అయ్య మాతో గడపడం ఏటా జరిగే తంతు ఈ సారి అందులో నీవూ పంచుకో ఓ వంతు" అమ్మ ఇచ్చిన ఆలంబనతో వచ్చిన బలంతో నవమి రాకకై ఎదురు చూస్తూ నిలుచున్నా రానే వచ్చింది శుభ ఘడియ రామనవమి వేడుకలు జరుగుతున్నాయి ఘనంగా శ్రీరామ శ్రీరామ భజనలతో జగమే రామమయంగా మారుత తుల్య వేగంతో మారుతి భువి చేరాడు పరవశంగా అయ్య పాదాలవైపు పరుగిడబోయా అదే సదవకాశంగా అదేమి వింతో, నా అడుగూ కదిలింది హనుమయ్య తోటే ఆయన వెనుకే నిలబెట్టింది భజనలు జరిగే చోటే రామనామం అంటూంటే, వింటూంటే కలిగే పులకింత రామయ్యే తన చేతితో తల నిమిరినంతకు వెయ్యింత నామాల మాల రామ పాదాల చేరనీ, చేరకపోనీ ఈ సారి మెల్లిగా అడిగేస్తా తల్లి సీతమ్మని రామనామం సదా నా చెవుల సోకనిమ్మని ఆ నామ రుచి నా నాల్కంచుల నిలువనిమ్మని
+1
1
+1
+1
+1

Leave a Reply to Anonymous Cancel reply